Chandrababu : నేడు మహారాష్ట్రకు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Update: 2026-01-29 04:04 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన లోకేశ్ తో కలసి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం తిరిగి విజయవాడకు చేరుకుంటారు. మధ్యాహ్నం మధ్యాహ్నం 2.15 గంటలకు సచివాలయానికి చంద్రబాబు చేరుకుంటారు.

వివిధ శాఖలపై సమీక్ష...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న అధికారులు, మంత్రులతో ఆయన మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News