చంద్రబాబుపై భూమన సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నాడు జంతవుల కొవ్వు కల్తీ కలిసిందని చంద్రబాబు ఆరోపణలను ఇప్పుడు వెనక్కు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అలాగే పవన్ కల్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డూలోనూ జంతువులు కొవ్వు కలిసిందని పవన్ కల్యాణ్ అన్నారని, మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
భక్తుల మనోభావాలను...
వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా ఇద్దరు నేతలు వ్యవహరించారని, హిందువులకు ఈ ఇద్దరు నేతలు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఆ తిరుమలేశుడు తగిన రీతిలో బుద్ధి చెబుతారంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.