చంద్రబాబు పచ్చి అవకాశవాది : అంబటి రాంబాబు
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారం కోసం దేనికైనా తెగిస్తారన్న అంబటి తిరుమల మహా ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైందని తెలిపారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారని, లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారన్నారు.
తమపై కేసులు పెడితే...
తమపై కేసులు పెడితే న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందన్నారు. శ్రీవారిని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయోచ్చా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.