లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైంది
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుతో కల్తీ నెయ్యితోనే శ్రీవారి లడ్డూలు, ప్రసాదాలు తయారీ అని బట్టబయలందని మంత్రి తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపిన వారిని ఏం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
పాలు కాకుండా...
చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారీ మహాపాపమన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తప్పు చేయలేదని చెప్పేవారు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగారని ప్రశ్నించారు. టీటీడీ నిబంధనలను నీరుగార్చి ఇష్టానుసారంగా కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని, తిరుమలను వైసీపీ అక్రమాల, పాపల పుట్టగా మార్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా మించినది ఏమి లేదు, కల్తీ చేసిన వారు స్వామివారిని క్షమాపణ కోరాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.