Tirumala : తిరుమలకు నేడు వచ్చే వారికి గుడ్ న్యూస్

నేడు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

Update: 2026-01-29 03:34 GMT

నేడు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. స్వామి వారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అయితే రద్దీ పూర్తిగా తగ్గలేదు కానీ, గతంతో పోలిస్తే మాత్రం చాలా వరకూ రద్దీ తగ్గిందనే చెప్పాలి. వరస సెలవులు పూర్తి కావడంతో పాటు ఇక పరీక్షలు దగ్గరపడుతుండటంతో పాటు నేడు గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. తిరిగి రేపటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

గతంలో ఏడాదికి ఒకసారి...
తిరుమలకు వచ్చే భక్తులు గతంలో మొక్కులు మొక్కకుని ఏడాదికి ఒకసారి వచ్చేవారు. కానీ నేడు తిరుమల ఆధ్యాత్మిక ప్రదేశంతో పాటుగా పర్యాటక ప్రాంతంగా కూడా మారింది. తిరుమల కొండ మీదకు వస్తే భక్తితో పాటు కొంత మనసుకు స్వాంతన చేకూరుతుందని భావించే వారు ఎక్కువయ్యారు. అందుకే ఏడాదిలో ఎన్ని సార్లయినా తిరుమలకు వచ్చేందుకు వెనుకాడటం లేదు. తిరుమలకు పెరుగుతున్న రద్దీని చూసి అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నప్పటికీ వసతి గృహాల కొరత మాత్రం ఇంకా తీరడం లేదని భక్తులు అంటున్నారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల స్వామి వారిని 72 వేల 637 మంది భక్తులు దర్శించుకున్నారు.24 వేల 739 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News