Ys Jagan : జగన్ నేడు కీలక సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమైన నేతలకు ఆహ్వానం పంపారు. జిల్లాల నుంచి ఇప్పటికే కొందదరు నేతలు విజయవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ వీరితో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
వెన్నపోటు దినం గా...
దీంతో పాటు వరసగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన, జరుగుతున్న అక్రమ అరెస్ట్ లు, నమోదవుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ నేతలతో చర్చించనున్నారు. అలాగే జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం నిర్వహణపై ప్రధానంగా జగన్ నేతలతో చర్చించి ఆ రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.