అంబటి ఇంటిపై టీడీపీ దాడి

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు

Update: 2026-01-31 12:27 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. ఆయన కారుతో పాటు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అంబటి మీడియా సమావేశం పెట్టిన తర్వాత గుంటూరులోని ఆయన ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగాయి. కర్రలు, రాళ్లతో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన ఇంటితో పాటు కార్యాలయంపై కూడా దాడి చేశారు. పోలీసులు నిలువరించే ప్రయత్నించే చేసినప్పటికీ వీలు కాలేదు. చంద్రబాబు అంతు చూస్తానన్న అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. కోడిగుడ్లపై కూడా వారు దాడి చేశారు. పోలీసులు స్వల్ప సంఖ్యలో ఉండటంతో ఎక్కువ సంఖ్యలోవచ్చిన టీడీపీ కార్యకర్తలను నిలువరించలేకపోతున్నారు.

పోలీసులు మొహరించినా...
నవ భారతనగర్‌లోని అంబటి ఇంటి వద్ద పోలీసుల మోహరించినా ఫలితం లేకుండా పోయింది. అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా కార్యకర్తల డిమాండ్‌ చేశారు. అంబటి క్షమాపణ చెప్పేవరకు వెళ్లబోమన్న టీడీపీ మహిళా కార్యకర్తలు అక్కడే కూర్చున్నారు. క్షమాపణ చెప్పకుంటే అంబటికి తగిన బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహిళల డిమాండ్‌ చేశారు. అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం వద్ద పోలీసుల మోహరించినా ఫలితం లేకుండా పోయింది. చంద్రబాబు కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ శ్రేణుల డిమాండ్‌ చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ ఈ దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు నివాసంలోనే ఉన్నారు.


Tags:    

Similar News