Chandrababu : నేడు రెండో రోజు కుప్పంలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు

Update: 2026-01-31 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం పది గంటలకు బెగ్గిలిపల్లె పంచాయతీలో సామాజిక పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం శాంతిపురం వద్ద ప్రజావేదిక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

పలు పరిశ్రమలతో ఒప్పందాలు...
నిన్న కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు కూడా అనేక కార్యక్రమాలను ప్రారంభిస్తారు.శంకుస్థాపనలు చేస్తారు. శాంతిపురం వద్ద నేడు 5,555 సైకిళ్లను పంపిణీని నేడు చంద్రబాబు చేయనున్నారు. అలాగే కుప్పంలో ఏర్పాటు చేసే ఏడుకొత్త పరిశ్రమలపై నేడు చంద్రబాబు మౌఖిక ఒప్పందాలు చేసుకోనున్నారు.


Tags:    

Similar News