Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది.
నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. నిజానికి రేపు పంపిణీ చేయాల్సి ఉండగా ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల మొదటి తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు చెల్లించాలని నిర్ణయించింది. ఒకటో తేదీ ఆదివారం కావడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఉదయం నుంచే...
సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తాన్ని అందచేయనున్నారు. వృద్ధులు, వితంతవులకు నెలకు నాలుగు వేలు, వికలాంగులకు ఆరువేల చొప్పున ఇస్తున్నారు. ఈ పింఛన్ల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.