Weather Report : దంచికొట్టనున్న ఎండలు.. కాచుకోమంటున్న సూరీడు

ఎండలు దంచి కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి వేళలో ఉష్ణోగ్రతలు పెరిగాయి

Update: 2026-01-31 04:25 GMT

ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ తప్పించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి వేళలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి టెంపరేచర్స్ చేరాయి. ఫిబ్రవరి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈసారి అత్యధిక స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ లో ఇటీవల వానలు, చలి ఏ తరహాలో అయితే ఎక్కువగా కనిపించాయో.. ఎండలు కూడా అదే స్థాయిలో ఉంటాయని, వాతావరణంలో మార్పులు, కాలుష్యం వంటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు గరిష్టానికి పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని చోట్ల 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, పల్నాడు, కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక పొగమంచు తీవ్రత కూడా తగ్గింది. భానుడు ఉదయం ఏడు గంటల నుంచే భగభగమంటున్నాడు. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాత్రం ఒకింత చలి వాతావరణం నెలకొంది.
ఒక్కసారిగా మారడంతో...
తెలంగాణలో కూడా వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. విద్యుత్తు శాఖ నిర్వహణ పేరిట అప్పుడే గంటల కొద్ది విద్యుత్తు సరఫరాలో కోత విధించడం ప్రారంభించింది. విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా పెరగడంతో మీటర్లు గిరాగిరా తిరుగుతున్నాయి. ఇక ఉదయం, తెల్లవారు జామును మాత్రం ఒకింత చలి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వంటి నగరంలోనూ పగటి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక సూర్యాపేట, కొత్త గూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
Tags:    

Similar News