గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు

గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

Update: 2026-01-30 07:34 GMT

గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 100 కోట్ల రూపాయల విరాళాలతో నిర్మించిన కానూరి-జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కాలేజీ పూర్వవిద్యార్థులు 100 కోట్ల రూపాయలు, ప్రభుత్వం తరపున మోడ్రన్ హెల్త్ సెంటర్లో ఎక్విప్మెంట్, ఫర్నిచర్ నిమిత్తం రూ. 27 కోట్లు ఖర్చు చేశారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రం...
2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 5 అంతస్తులు, 600 బెడ్లతో అత్యాధునిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపట్టారు. దీనివల్ల శిశువులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ తమీన్ అన్సారియా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


Tags:    

Similar News