తిరుమల దర్శనాలు.. ఈ నెలలో స్వల్ప మార్పులు
స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా
ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఫిబ్రవరి నెలకు సంబంధించి స్వల్ప మార్పులు చేశారు. మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ సూచించింది.
తిరుమలలో ఫిబ్రవరి నెలలో విశేష కార్యక్రమాలు జరిగే రోజులు:
ఫిబ్రవరి 2 – వసంత పంచమి
ఫిబ్రవరి 4 – రథ సప్తమి
ఫిబ్రవరి 5 – భీష్మాష్టమి
ఫిబ్రవరి 6 – మధ్వనవమి
ఫిబ్రవరి 8 – భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి 12 – శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ
ఫిబ్రవరి 24 – సర్వ ఏకాదశి
ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి