అధ్యయన కమిటీ ఏర్పాటు అవసరం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాటుసారా, జే బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ వేయనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాటుసారా, జే బ్రాండ్ మద్యంపై అధ్యయన కమిటీ వేయనున్నారు. ఈ మేరకు ఆయన టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నాటుసారా, జే బ్రాండ్ మద్యం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో మరణాలు సంభవిస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కల్తీ సారా వల్ల జంగారెడ్డిగూడెంలో అనేక మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని చంద్రబాబు అన్నారు.
మద్యపాన నిషేధం.....
అందుకే నాటుసారా విక్రయాలు, జే బ్రాండ్ మద్యంపై త్వరలోనే టీడీపీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒకవైపు మద్య నిషేధం అంటూనే జే బ్రాండ్ మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ ఎన్నికలకు ముందు ప్రకటించిన మద్యపాన నిషేధం హామీపైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.