నేడు వైకుంఠ ఏకాదశి.. కిటకిటలాడుతున్న ఆలయాలు
నేడు వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి
నేడు వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే వెంకటేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెతీ్తారు. తిరుమలలో తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వారాన్ని తెరవడంతో భక్తులు స్వామి వారిని దర్వించుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు అమ్మవారి ఆశీస్సులను పొందేందుకు బారులు తీరారు. అన్ని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
తెల్లవారు జాము నుంచే...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో తెల్లవారు జాము నుంచి కిక్కిరిసిపోయింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. వేములవాడ రాజన్నఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సింహాచలం అప్పన్న స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాలు కూడా భక్తజనం సంద్రంగా మారాయి. నేడు స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యమని భావించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.