Andhra Pradesh : టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత రాజీనామా చేశారు. సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
satyanarayana passed away
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత రాజీనామా చేశారు. సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొందరు కావాలనే తన ఓటమికి ప్రయత్నించినా టీడీపీ నాయకత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని గత కొంతకాలంగా సుగవాసి సుబ్రహ్మణ్యం అసంతృప్తిగా ఉన్నారు.
కొంత కాలం నుంచి ప్రచారం...
పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మహానాడు కార్యక్రమానికి కూడా సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరు కాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయన పార్టీని వీడతారని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ అధినాయకత్వం పిలిచి మాట్లాడలేదు. అయితే తాజాగా సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.