రోశయ్య పట్ల జగన్ కు మనసు రాలేదు

దివంగత రోశయ్య మృతి పట్ల ఏపీ ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Update: 2022-03-16 13:13 GMT

దివంగత రోశయ్య మృతి పట్ల ఏపీ ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పేరును ఒక ప్రభుత్వ సంస్థకు, కార్యక్రమానికి ఆయన పేరు పెట్టడానికి కూడా జగన్ కు మనసు రాలేదన్నారు. రోశయ్యకు నివాళులర్పించడానికి కూడా జగన్ ఇష్టపడలేదని చంద్రబాబు అన్నారు. తాము గతంలో చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మరణిస్తే వారి పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే....
తాము అధికారంలోకి రాగానే రోశయ్కను తగిన విధంగా గౌరవించుకుంటామని చంద్రబాబు తెలిపారు. పొట్టి శ్రీరాముల త్యాగం వల్లనే రాష్ట్ర ఆవిర్భవించిందని అన్నారు. జగన్ ప్రభుత్వం వేధింపులతో రౌడీరాజ్యం అమలవుతుందని చంద్రబాబు అన్నారు. జగన్ ట్యాక్స్ కట్టలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడెప్పుడు రెండేళ్లు పూర్తవుతుందా? ఈ కుంపటిని నెత్తిమీద నుంచి దించుకుందామా? అని ప్రజలు వేచి చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News