Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు

Update: 2025-11-08 03:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసి పెద్దయెత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేతలతో సమావేశమై...
ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలు అధికారులకు జారీ చేయనున్నారు. అనంతరం పార్టీ నేతలలో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. రాష్ట్ర కమిటీపై కూడా చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు తిరువూరు వివాదానికి సంబంధించిన నివేదికన క్రమశిక్షణ కమిటీ అందచేయనుంది.


Tags:    

Similar News