టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణ
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది
tdp, candidate, mlc of local bodies, visakha district
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనపై మూడు సార్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై తన ఫోన్ నెంబరు తీసుకున్నాడని, అప్పటి నుంచి తనకు ఫోన్ చేసి రూమ్ కు రమ్మని పిలిచేవాడని తెలిపారు.
హోటల్ కు రమ్మని...
అయితే ఎమ్మెల్యే కావడంతో తాను వెళ్లానని ఆ సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళ చెప్పారు. బాధితురాలిని తిరుపతిలోని భీమాస్ హోటల్ కు పిలిపించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళ ఆరోపించారు. ఆదిమూలం గురించి అందరికీ తెలయాలనే తాను పెన్ కెమెరాను పెట్టుకున్నానని తెలిపారు.