Andhra Pradesh : నేడు ఏసీబీ కోర్టుకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు నిందితులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు నిందితులకు రిమాండ్ గడువు ముగియనుంది. నేడు ఎనిమిది మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు

Update: 2025-09-12 03:29 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు నిందితులకు రిమాండ్ గడువు ముగియనుంది. నేడు ఎనిమిది మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మందిని అరెస్ట్ చేయగా అందులో నలుగురికి బెయిల్ లభించింది. మిగిలిన నలుగురు విజయవాడ, రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈరోజు ఎనిమిది మందిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.

ముగిసిన సిట్ సోదాలు...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల సోదాలు హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సిట్ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం పదకొండు గంటలకు మొదలయిన సిట్ అధికారుల తనిఖీలు నేటి తెల్లవారు జాము వరకూ కొనసాగాయి. ఈ సోదాల్లో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని విజయవాడకు తరలించారు.


Tags:    

Similar News