Revanth Reddy : నేడు కడప రేవంత్ రెడ్డి

నేడు కడపకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-12-07 04:12 GMT

నేడు కడపకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. కడప జిల్లాకు చేరుకుని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటికి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి ఎంపీ సీఎం రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవలే ఎంపీ సీఎం రమేష్‌ తల్లి మరణించడంతో ఆయనను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లనున్నారు.

సీఎం రమేష్ కుటుంబాన్ని...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడప జిల్లాకు వెళ్లి అక్కడ సీఎం రమేష్ ను పరామర్శించిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బీజేపీలో ఉన్నా రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ మిత్రుడు కావడంతో ఆయన పరామర్శకు బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు కడప జిల్లాకు కేంద్రమంత్రి కమలేష్ కూడా సీఎం రమేష్ ఇంటికి రానున్నారు.


Tags:    

Similar News