శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి
శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో నోట్ల కట్టలు ఉన్నట్లు టోల్ సిబ్బంది గుర్తించారు. మొత్తం ముప్ఫయి లక్షల రూపాయల నగదు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే తాము స్వాధీనం చేసుకున్న ముప్ఫయి లక్షల నగదుతో పాటు వాహనంలో ఉన్న వారిని కూడా పోలీసులకు అప్పగించారు.
ముప్ఫయి లక్షల కరెన్సీ...
కానీ తాము బంగారం వ్యాపారులమని, బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెళుతూ మార్గమధ్యంలో దైవదర్శనానికి వచ్చామని వారు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేసిన అధికారులు ఆ నోట్ల నెంబర్లను నోట్ చేసుకున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి తీసుకెళుతూ పట్టుబడిన నగదుగా గుర్తించారు.