ఏపీలో ఉద్యమానికి శ్రీకారం : వైఎస్ షర్మిల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పిబ్రవరి 2 తో 20 ఏళ్లు పూర్తయిందని, బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకాన్ని...
ఉపాధి హామీ పథకాన్ని తొలుత ప్రారంభించింది ఏపీ లోనేనని షర్మిల గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి నుంచి రాష్ట్రంలో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఉపాధి హామీ పోరాటానికి రాష్ట్రానికి రావాలని రాహుల్ ని ఆహ్వానించానని, అందుకు ఆయన అంగీకరించారని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చి నిరుపేదలతో పాటు రాష్ట్రాలను కూడా కేంద్రం అన్యాయం చేసిందని షర్మిల అన్నారు.