ఏపీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ
ఏపీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సిట్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారించనుంది
ఏపీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సిట్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, బెయిల్ రద్దు చేయాలని సిట్ హైకో్ర్టులో పిటీషన్ వేసింది.
బెయిల్ సవాల్ చేస్తూ...
డిఫాల్ట్ బెయిల్ సవాల్ చేస్తూ సిట్ పిటిషన్ వేయడంతో దీనిపై నేడు విచారణ జరపనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల హైకోర్టు తెలిపింది. దీనిపై వారి తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై హైకోర్టు నిర్ణయం ఆసక్తికరంగా మారింది.