Breaking : ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురికి బెయిల్ మంజూరయింది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎంవో అధికారి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి వీరంతా గత కొద్ది నెలలుగా జైలులో ఉన్నారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. అయితే న్యాయస్థానం ఉత్తర్వులు అందాల్సి ఉన్నందున రేపు ఉదయం జైలు నుంచి ఈ ముగ్గురు జైలు నుంచి విడుదయ్యే అవకాశముంది.
పన్నెండు మంది నిందితుల్లో...
దీంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నలుగురికి బెయిల్ మంజూరయినట్లయింది. తొలిసారిగా ఏ30 నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ కుమార్ కు గతంలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పన్నెండు మంది నిందితులు అరెస్ట్ కాగా అందులో నలుగురికి పూర్తి స్థాయి బెయిల్ లభించింది. మిధున్ రెడ్డికి తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ లభించింది. మధ్యంతర బెయిల్ లభించిన మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన తిరిగి ఈ నెల 11వ తేదీన సరెండర్ కావాల్సి ఉంది.