నేటి నుంచి ఐపీఎస్ అధికారి సంజయ్ పోలీస్ కస్టడీ
ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు
ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ జీజీహెచ్‌కు సంజయ్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం సంజయ్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఐపీఎస్ అధికారి సంజయ్ పై నమోదయిన కేసుల్లో ఆయన న్యాయస్థానంలో లొంగిపోయారు.
మూడు రోజుల పాటు విచారణ...
తర్వాత న్యాయస్థానం సంజయ్ ను కస్టడీకి అప్పగించింది. ఈరోజు నుంచి మూడు రోజులపాటు సంజయ్‌ను ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విచారణ చేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.