అలర్ట్ : కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ భారీ వర్షం కురుస్తోంది

Update: 2022-10-06 07:41 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విజయవాడలో కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భవానీలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు.

తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, నదులు పొంగి పొరలుతున్నాయి. అనేక చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులో ఒక కారు కొట్టుకుని పోగా, ఆ కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఇద్దరూ చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.


Tags:    

Similar News