Andhra Pradesh : సియోల్ లో ఏపీ మంత్రులు పర్యటన

సియోల్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటిస్తుంది.

Update: 2025-09-29 04:17 GMT

సియోల్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టుల అధ్యయనానికిమంత్రులు నారాయణ,జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు సియోల్ వెళ్లారు. ఈ ఉదయం సియోల్ లో ఇండియన్ ఎంబసీ అధికారులతో సమావేశమైన మంత్రులు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషన్ కాంత్ సింగ్, ఈఓఐ ఫస్ట్ సెక్రటరీ సంజనా ఆర్య తో సమావేశమయ్యారు.

అభివృద్ధి ప్రాజెక్టులపై...
సమావేశంలో పాల్గొన్న అధికారులు ఎం.టీ.కృష్ణ బాబు,పీయూష్ కుమార్,ఏపీ ఈడీబీ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి,పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇండియన్ ఎంబసీ అధికారులతో చర్చ జరగనుంది. మంత్రులు అమరావతిలో అభివృద్ధి చేయాల్సిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.


Tags:    

Similar News