Free Gas Cylinder : ఉచిత సిలిండర్ కు వారం రోజులే గడువు
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలెండర్లు బుక్ చేసుకునే వారికి ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలెండర్లు బుక్ చేసుకునే వారికి ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో రెండో విడత సిలిండర్ బుకింగ్ సమయం పూర్తవుతుంది. అంటే ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపు రంగు రేషన్ కార్డులున్న అర్హులైన వారికి అందచేస్తున్న సంగతి తెలిసిందే.
దీపం పథకం కింద...
ఈ పథకం కింద ఈ ఏడాది రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో లబ్దిదారులు సిలిండర్ ను బుక్ చేసుకోవాలని సూచించింది. గ్యాస్ బుకింగ్ చేసిన 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. . వచ్చేనెల 1వ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది.