Andhra Pradesh : చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం.. సీఐడీ కేసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది

Update: 2025-09-10 06:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ ప్రారంభించింది. పురుగు మందులు, యూరియా వినియోగం తగ్గించాలంటూ సీఎం ఫేక్ వీడియోను కొందరు విడుదల చేయడంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగార. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలపై సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారం చేశారని కేసులు నమోదు చేశారు.

రైతులను ఉద్దేశించి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించారని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించింది. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఐజీ తెలిపారు. వాస్తవాలు ధృవీకరించకుండానే ఏ సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సైబర్ క్రైమ్ అధికారులు కోరారు.


Tags:    

Similar News