తిరుమలలో ఏఐపై మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమన్నారంటే?
తిరుమలలో దర్శనం సులువుగా అయ్యేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సరి కాదని మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు
తిరుమలలో దర్శనం సులువుగా అయ్యేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సరి కాదని మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆలయంలో పరిమితి ఉన్న దృష్ట్యా అది సాధ్యం కాదని ఆయన అన్నారు. ఆ ఆలోచనలను విరమించుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. గంటలోనో, మూడు గంటల్లోనూ దర్శనం కల్పిస్తామని చెప్పడం, దానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు.
సాధ్యం కాదని...
భక్తులు అధికంగా తిరుమలకు వస్తుండటంతో పాటు తిరుమలకు ఉన్న ప్రత్యేకతల కారణంగా ఏఐ ద్వారా భక్తులను త్వరగా దర్శనం చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు కానీ, పాలకులు కానీ ప్రకటించడం సరికాదని అన్నారు. ఆలోచనలను విరమించుకుని తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించడంపై దృష్టి మరింతగా పెట్టాలని సూచించారు.