Andhra Pradesh : ఏపీలో మరోసారి బార్ల లైసెన్సు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీకి స్పందన కొరవడటంతో మరోసారి బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించింది

Update: 2025-09-13 04:45 GMT

liquor shops in AP

ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీకి స్పందన కొరవడటంతో మరోసారి బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించింది. 428 బార్లకు పది రోజుల్లో కేవలం పదకొండు బార్లకే దరఖాస్తులు రావడంతో ఎక్కువ బార్లకు దరఖాస్తులు రాలేదు. రేపటితో గడువు ముగియనుంది. సోమవారం కొత్త బార్లకు లాటరీని నిర్వహించాల్సి ఉండగా ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

దరఖాస్తులు రాకపోవడంతో...
అయితే కొత్త బార్ల పాలసీతో వ్యాపారులు ఏర్పాటుకు మొగ్గు చూపడం లేదు. బార్ల లైసెన్స్ ఫీజు తగ్గించినప్పటికీ దరఖాస్తులు ఆశించిన రీతిలో రాలేదు. దీంతో మరొకసారి బార్ల లైసెన్సులకు దరఖాస్తులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకూ మిగిలిపోయిన బార్లకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.


Tags:    

Similar News