Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లపై నాదెండ్ల ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Update: 2025-12-10 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు వేగవంతంగా చెల్లింపులు జరపనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశఆమన్నారు. ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటి వరకూ 67,822 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు.

రైతుల నుంచి...
మొత్తం ఇప్పటి వరకు 18,32,674 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 2,85,125 మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి వివరించారు. దీని మొత్తం విలువ 4,345.56 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు 4,085.37 కోట్ల రూపాయలు చెల్లించామని, లబ్ది పొందిన రైతుల సంఖ్య 2,67,944 గా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


Tags:    

Similar News