Ys Jagan : బుజ్జగించినా.. ఫలితం లేకపోయే.. ఇక ఈ మీటింగ్ లు ఎందుకు డ్యూడ్
వైసీపీ అధినేత జగన్ వరసగా సమావేశాలు పెడుతున్నప్పటికీ నేతలు మాత్రం పార్టీని వీడి వెళ్లిపోవడం ఆగడం లేదు
ycp chief ys jagan
వైసీపీ అధినేత జగన్ వరసగా సమావేశాలు పెడుతున్నప్పటికీ నేతలు మాత్రం పార్టీని వీడి వెళ్లిపోవడం ఆగడం లేదు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోతాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి. అయితే నాడు అధికారంలో ఉండటంతో పాటు క్యాడర్ కూడా పోటీ పడి పనిచేయడంతో అంతటి విజయం లభించింది. అదే సమయంలో మూడు చోట్ల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా అందరికీ అర్థమయింది. కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయన్న అంచనాలు వినిపించాయి.
గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఫలితాలప్పుడే...
కానీ జగన్ మాత్రం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోలేదు. వన్ మ్యాన్ షోతో రెండోసారి విజయం సాధించాలని భావించారు. ఎవరు చెప్పినా తలకెక్కించుకోకపోవడంతోనే గత ఎన్నికల్లో పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నేతలతో పాటు స్థానిక సంస్థల నేతలు కూడా ఒక్కరూ మిగలడ లేదు. ఇప్పటికే చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలూ కూటమి పరమయ్యాయి. ఛైర్మన్లు, మేయర్లు వారంతట వారే స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థి ఛైర్మన్ గానో, మేయర్ గానో ఎన్నిక కావడానికి అవసరరమైన మార్గాన్ని వారే సుగమం చేస్తున్నారు. కావాల్సినంత బలం ఉన్నప్పటికీ పార్టీ వీడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
సమావేశాలు ఏర్పాటు చేసినా...
ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆపేందుకు వరసగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పుడు కూడా పదవులు ఇతస్ామని భరోసా ఇస్తున్నారు. విశాఖ కార్పొరేటర్లతో సమావేశం అయి క్యాంపులకు తరలించినా చివరకు జగన్ మాటలను పెడచెవిన పెట్టి కార్పొరేటర్లు పార్టీని వీడి వెళుతున్నారు. జగన్ ఎంత నమ్మకంగా వచ్చేది మన ప్రభుత్వమేనని చెబుతున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు విస్మరించడం లేదని అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. జగన్ సొంత జిల్లాలో కూడా నేతలు ఎవరూ ఉండటం లేదు. కడప మేయర్ ను ప్రభుత్వం తొలిగిస్తే, మేయర్ మున్సిపల్ ఛైర్మన్ మాత్రం తనంతట తానే తప్పుకున్నారు.
అధికారంలో ఉన్ననాళ్లు...
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా వారు సంతృప్తికరమైన పాలన అందించలేకపోయామని అంటున్నారు. తాము మేయర్ గా ఉన్నా, చైర్మన్లుగా ఉన్నా తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, కనీసం తమ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నిధులు కూడా జగన్ ఇవ్వలేకపోయారని, ఎన్నికల్లో తాము డబ్బు ఖర్చు పెట్టి గెలిచి కూడా నిధులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని చాలా మంది అంటున్నారు. ఎక్కువ మంది నేతలు పార్టీని వీడి వెళ్లడానికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమి అంటున్నారు. అందుకే జగన్ ఎంత బుజ్జగించినా తాము మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.