TDP : నేడు చంద్రబాబుకు తిరువూరు పై నివేదిక

తిరువూరు వివాదంపై నేడు క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది

Update: 2025-11-06 03:15 GMT

తిరువూరు వివాదంపై నేడు క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య జరిగిన మాటల యుద్ధం పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన ఇద్దరు నేతలతో క్రమశిక్షణ కమిటీ సమావేశమయింది.

ఇరువురు నేతల అభిప్రాయాలను...
వారి నుంచి వివరణ తీసుకుంది. ఇద్దరు తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పారు. ఇద్దరి వివరణతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని నేడు చంద్రబాబు నాయుడుకు అందించనుంది. లండన్ నుంచి నేడు చంద్రబాబు నాయుడు తిరిగి వస్తుండటంతో నివేదిక ఇవ్వనుంది. నివేదికను అనుసరించి చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News