ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 164 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 164 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,71,070 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,426 మంది మరణించారు.
కోలుకున్న వారి సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,54,252 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,392యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,01,54,125 నమూనాలను పరీక్షించారు.