నేడు ఢిల్లీలో జలవివాదాలపై కమిటీ తొలి సమావేశం
ఈరోజు తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది
ఈరోజు తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో తలెత్తిన జలవివాదాలపై చర్చించనున్నారు.
ఏపీ, తెలంగాణల మధ్య...
కృష్ణా నదిపైనా, గోదావరి నదిపైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం తెలిపింది. అయితే వృధాగా పోయే నీటిని మాత్రమే తాము గోదావరి నుంచి తరలిస్తున్నామని ఏపీ వాదిస్తుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ వాదనలను వినిపించనున్నారు. తర్వాత జలవివాదాలకు పరిష్కారం కనుగొనే అవకాశముంది.