Pawan Kalyan : నేడు అరకు కు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు విశాఖలో పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ అరకు ఉత్సవాలకు హాజరు కానున్నారు. నిన్న విశాఖ పట్నం చేరుకున్న పవన్ కల్యాణ్ జూ పార్క్ ను సందర్శించారు. జూ పార్క్ ను కలియదిరిగారు. అక్కడ జంతువులను దత్తత తీసుకున్నారు. జూ పార్క్ లో సందర్శకుల ఏర్పాట్లను పరిశీలించారు.
అరకు ఉత్సవాల్లో...
నేడు అరకు ఉత్సవాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్ అక్కడి గిరిజనులతో కలసి కాసేపు గడపనున్నారు. అరకును మరింతగా పర్యాటకరంగంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. రేపు పవన్ కల్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమవుతారు. విశాఖపట్నంలో వాయు, జల కాలుష్యం నిావారకణ చర్యలపై చర్చించనున్నారు.