Chandrababu : నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ నిర్వహించనున్నారు.
మూడు రోజుల పాటు...
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభించనున్నారు. కంగుందిలో హెరిటేజ్ సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్, బౌల్డరింగ్ పార్క్ ప్రారంభం, అలాగే, వంద అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడు రోజుల పాటు కుప్పంలోనే చంద్రబాబు పర్యటన ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.