Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.

Update: 2026-01-30 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో నేటి నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వీకెండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు శుక్రవారం నుంచి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని భావించిన టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాల తయారీతో పాటు అన్న ప్రసాదాన్ని కూడా అందరికీ అందేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. మరో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశముంది.

మొక్కులు తీర్చుకోవడానికి...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. ఏడుకొండల వాడిని తమ కోరిన కోర్కెలు తీరితే తలనీలాలను సమర్పించుకుంటానని ఎక్కువ మంది భక్తులు మొక్కుకుంటారు. అందుకే తమ కోరికలు తీరిన వెంటనే కొండకు పయనమవుతారు. ముడుపులు కట్టుకుని తిరుమలకు రావడం సంప్రదాయంగా వస్తుంది. ఉద్యోగం, ఆరోగ్యం, ఇల్లు ఇలా అన్ని రకాలుగా కోర్కెలను తీర్చే దేవుడిగా వైకుంఠవాసుడికి పేరుండటంతో భక్తులతో తిరుమల నిరంతరం రద్దీగానే ఉంటుంది.
31 కంపార్ట్ మెంట్లలో ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,315 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,076 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.76 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News