Nara Lokesh: నేడు కాకినాడలో లోకేష్
మంత్రి నారా లోకేశ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు
రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.నేడు కాకినాడలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒకరోజు పర్యటన చేస్తున్నారు. రోడ్డుమార్గం ద్వారా కాకినాడకు మంత్రి లోకేష్ బయలుదేరారు. కాకినాడ జేఎన్ టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు.
టీడీపీ నేతలతో...
అనంతరం కాకినాడలో కోరమాండల్ ఆసుపత్రిని మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. కూటమి నేతలతో సయోధ్యతో మెలగాలని, అందరూ కలసి కట్టుగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు.