Andhra Pradsh : చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు...145 కోట్లు చెల్లించాలంటూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు

Update: 2025-09-24 01:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మాట్లాడారంటూ ఆయన లీగల్ నోటీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్నారు.

వివేకా హత్య కేసులో...
అయితే ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడారని, దీనికి తనకు 1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ చంద్రబాబుకు పంపిన లీగల్ నోటీసుల్లో శంకరయ్య పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసులను శంకరయ్య చంద్రబాబుకు పంపారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సీఐగా ఉన్న శంకరయ్య అక్కడ ఉండగానే నిందితులు ఆధారాలను చెరిపేశారంటూ చంద్రబాబు పదే పదే ఆరోపించడంతో ఈ లీగల్ నోటీసులు పంపారు. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్నారు


Tags:    

Similar News