Chandrababu : అటువంటి వారిపై కేసులు పెట్టండి.. కఠిన చర్యలు తీసుకోండి
ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆరా తీశారు. వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఎంత మేరకు ఎరువులు, యూరియా ఉందన్న దానిపై తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందా? లేదా? అన్నది అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు విజిలెన్స్ తనిఖీలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
యూరియా అందరికీ...
యూరియా, ఎరువులకు సంబంధించిన స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కొరత లేకుండా చూడాలన్నారు. ఎరువుల ధరలు పెంచి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎరువులను మార్క్ ఫెడ్ ద్వారానే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులందరికీ యూరియా లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతులకు అవసరమైన మేరకు సరఫరా చేయాలని సూచించారు.