మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ ఆడుతున్న డ్రామాలివే

ప్రభుత్వ వైద్యకళాశాలల విషయంలోచంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-16 08:06 GMT

ప్రభుత్వ వైద్యకళాశాలల విషయంలోచంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి, నేను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగామన్నారు. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టామని, అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్‌గా మారిందని తెలిపార. ప్రతి ఒక్క కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కి.మీ. ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కి.మీ. ఒక హైస్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఇది విద్యా రంగంలో తమ ప్రభుత్వం ముద్ర వేసిందని చంద్రబాబు అన్నారు.

వీరు ఖర్చుచేసింది మాత్రం...
ఇప్పుడు కొంత మంది తయారయ్యారని, మెడికల్ కాలేజీలకు వీళ్ళు ఖర్చు చేసింది, కేవలం 5 శాతం నిధులు మాత్రమేనని చంద్రబాబు మండి పడ్డారు. ఐదు శాతం ఖర్చు చేసి మొత్తం కట్టేశాం అని చెప్తున్నారన్నచంద్రబాబు గతంలో వాళ్ళు శాతం సీట్లు ఫ్రీ పెట్టారని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయనిచంద్రబాబు తెలిపారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం తరువాత, అది ప్రభుత్వ ఆస్తి అవుతుందని, దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు.


Tags:    

Similar News