Andhra Pradesh : నేడు లండన్ కు నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు లండన్ లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు లండన్ లో పర్యటించనున్నారు. లండన్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. ఈఏడాది నవంబరు 14, 15వ తేదీల్లో విశాఖలో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ కు హాజరయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించనున్నారు.
వివిధ శాఖలపై అధ్యయనం...
దంతో పాటు విద్య, ఆరోగ్యం, ఫార్మా రంగాలపై నారా లోకేశ్ బృందం లండన్ లో అధ్యయనం చేయనుంది. నారా లోకేశ్ తో పాటు పరిశ్రమల శాఖకు చెందిన డైరెక్టర్ కూడా లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా అక్కడి వివిధ శాఖల అధ్యయనం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.