Chandrababu : నేడు విశాఖ, విజయవాడల్లో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖ, విజయవాడల్లో పర్యటించనున్నారు

Update: 2025-09-05 02:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖ, విజయవాడల్లో పర్యటించనున్నారు. విశాఖలో జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి విశాఖ బయల్దేరి వెళ్లనున్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఉదయం 10 గంటలకు జరిగే ఏసీఐఎఎం ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

విజయవాడలోనూ...
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఏడీఆర్) పై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి న్యాయ నిపుణులు పాల్గొంటారు. సమావేశం అనంతరం ఆయన అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉత్తమ పని తీరు కనబరిచిన 175 మంది టీచర్లకు చంద్రబాబు అవార్డులు ప్రదానం చేయనున్నారు.


Tags:    

Similar News