Andhra Pradesh : నేడు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈరోజు సెక్రటేరియట్ లో జరగనున్న సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వ ప్రాధమ్యాలను...
ఇటీవల జిల్లా కలెక్టర్లను పెద్ద సంఖ్యలో బదిలీ చేయడంతో వారికి ఆ జిల్లాల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించే బాధ్యతను అప్పగించనున్నారు. అలాగే వివిధ శాఖల సెక్రటరీలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. రేపు జిల్లా ఎస్పీలతో చంద్రబాబు సమావేశమవుతారు.