Chandrababu : అసెంబ్లీలో వ్యాఖ్యలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఒక టీమ్ అని, టీమ్‌లో ఏ ఒక్కరు తప్పు చేసినా చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు పర్సనల్ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే మన లక్ష్యానికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యక్తి గత అజెండాలు వద్దని తెలిపారు.
ఎన్డీఏ సంకల్పానికి...
ఎన్డీయే సంకల్పానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేయడానికి అందరూ కృషి చేయాలని, ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పనిచేస్తానని, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.