Chandrababu : మంత్రులపై చంద్రబాబు సీరియస్
మంత్రి వర్గ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారు
మంత్రి వర్గ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారు. యూరియా కొరతపై వైసీపీ చేస్తన్న విమర్శలకు మంత్రులు స్పందించాలని అన్నారు. ఈ సందర్భంగా యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఎరువులకు ఇబ్బంది లేకున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు సరైన సమయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదన్నారు.
దుష్ప్రచారాలపై...
ఇకనుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు. అలాగే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంతో సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ అన్నారు. ర్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని పవన్ కల్యాణ్ అన్నారు.