నేడు రెండో రోజు కస్టడీకి ఐపీఎస్ సంజయ్

నేడు రెండో రోజు కస్టడీకి ఐపీఎస్ సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు

Update: 2025-09-03 04:51 GMT

నేడు రెండో రోజు కస్టడీకి ఐపీఎస్ సంజయ్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. న్యాయస్థానం మూడు రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీకి అప్పగించింది. నిన్న సంజయ్ ను విచారించిన ఏసీబీ అధికారులు నేడు కూడా విచారించనున్నారు. ఫైర్ సేప్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ అధికారులు సంజయ్ ను ఈరోజు విచారణ చేయనున్నారు.

ఫైర్ సేప్టీ నిధుల దుర్వినియోగంపై...
ఫైర్ సేప్టీ నిధుల దుర్వినియోగం వెనక ఎవరు ఉన్నారు? ఎవరి ప్రమేయం ఉంది? ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు? ఎంత మేరకు నిధులు దుర్వినయోగమయ్యాయి? ఆ నిధులు ఎక్కడకు చేరాయి? వంటి అంశాలపై ఐపీఎస్ సంజయ్ ను ఏసీబీ అధికారులు నేడు విచారించనున్నారు. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News