Nara Lokesh : మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చిన నారా లోకేశ్

తెలుగుదేశం మంత్రులతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు.

Update: 2025-11-10 07:21 GMT

తెలుగుదేశం మంత్రులతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు. మంత్రివర్గం సమావేశానికి ముందు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియట్లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అవగాహనరాహిత్యంతో, అనుభవం లేక కొందరికి సమన్వయం ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలని, సమస్యలు ఎలా అధిగమిస్తున్నారో అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరమని మంత్రులతో లోకేశ్ చెప్పార.

కొత్త ఎమ్మెల్యేలకు...
కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని నారా లోకేశ్ సూచించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని మంత్రులకు పిలుపు నిచ్చారు. సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పిన మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రతి మంత్రి తమ శాఖల పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేరుద్దామని మంత్రి నారా లోకేశ్ మంత్రులకు ఈ సందర్భంగా తెలిపారు.


Tags:    

Similar News